నల్గొండ నార్కట్పల్లి మండలం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంత్రులతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ తల్లికి రాజగోపాల్ రెడ్డి పూలు సమర్పించారు.
అంతకుముందు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య,కుంభం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం తో కలిసి తమ సొంత గ్రామంలో తమ కలల ప్రాజెక్టును ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు.