సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు తీవ్ర అస్వస్థత
భారత దిగ్గజ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది, తమిళ మీడియా కథనం ప్రకారం ఆదివారం ఉదయం ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నైలోనే అపోలో ఆసుపత్రి తరలించినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఆయనకు కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. తెలుగులో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన కొమురం పులి సినిమాకు రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
మొన్న బాలీవుడ్‌లో రిలీజైన సెన్సేషనల్ మూవీ ఛావాకు కూడా రెహమానే సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న RC16 కు సైతం ఆయన పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురి కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.