గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో నవ కలశ పంచామృతాభిషేక సేవ శోభాయమానంగా స్వర్ణగిరీషుడి తిరువీధి ఉత్సవ సేవ..

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 17 సమర శంఖమ్ 

ధనుర్మాసం సందర్భంగా యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో నవ కలశ పంచామృతాభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. ఉదయం 10:30 ని లకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణభరిత వజ్రాభరణాలతో , సుగంధభరిత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు దివ్యకరములచే మరియు అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. స్వామి వారి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3 వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదిప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు చైర్మన్లు మానేపల్లి గోపికృష్ణ మురళీకృష్ణలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment