ప్రతి జన సైనికుడికి వీర మహిళలకు భరోసా కల్పించడమే ధ్యేయంగా జనసేన పార్టీ నాయకులు పర్నె శివారెడ్డి మునుగోడు నియోజకవర్గం లో 300 పైగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేశారు.
జనసేన క్రియాశీలక సభ్యులు సంస్థాన్ నారాయణపురం కి చెందిన గంగాపురం వెంకటేశం కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు
గంగాపురం మౌనిక కి రూ.5 లక్షల రూపాయల బీమా చెక్కు అందించేలా కృషి చేశారు. జనసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఈరోజు మధ్యాహ్నం హైద్రాబాద్ లోని కేంద్ర పార్టీ కార్యాలయం లో ఈ భీమ చెక్కు ను అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్,రాధ రాజలింగం, కావ్య, నియోజకవర్గ నాయకులు రవీందర్ రెడ్డి , పర్నే శివారెడ్డి, తోర్పునూరీ లింగస్వామి గౌడ్ మెగావత్ రాజు నాయక్. తదితరులు పాల్గొనడం జరిగింది