త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

తెలంగాణలో త్వరలోనే అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఇలాంటి జాబ్‌మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని, సొంత ఊరు దాటితేనే భవిష్యత్తు బంగారం అవుతుందని సీతక్క తెలిపారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని, అందుకే ఇలాంటి జాబ్‌మేళాను నిర్వహించామని కొండా సురేఖ అన్నారు.60 కంపెనీల ద్వారా 11వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు తాము చెప్పామని.. అందులో భాగంగానే ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు

Join WhatsApp

Join Now

Leave a Comment