నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలెన్నడో.?

దేవరకొండ డిసెంబర్ 26 సమర శంఖమ్:-

నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలెన్నడో……

నిరాశలో నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష రాసిన అభ్యర్థులు…..

ఫైనల్ రిజల్ట్ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూపులు…

ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ నోటీసులు నకిలీ వార్తలు రావడంతో అయోమయం….తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2322 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు మెడికల్ బోర్డు MHSRB ఆధ్వర్యంలో గత నెల నవంబర్ 23 పరీక్ష నిర్వహించగా సుమారు 42000 మంది ఈ పరీక్షకు హాజరవ్వడం జరిగింది…అయితే పరీక్ష తర్వాత మూడు రోజుల్లోనే మెడికల్ బోర్డు కీ ని విడుదల చేసింది…ఇంకా ఫైనల్ రిజల్ట్ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాల్సి ఉంది…అయితే సోషల్ మీడియాలో ఈరోజే ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటూ కొన్ని ఫేక్ నోటీసులు రావడంతో అభ్యర్థులు అయోమయం లో వున్నారు…ఈ ఫేక్ నోటీసులకు సంబంధించి MHSRB లో అవన్నీ నమ్మవద్దని ఒక వెబ్ నోటీసును సైతం విడుదల చేయడం జరిగింది….కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ను తొందరగా రిలీజ్ చేస్తే‌ బాగుంటుందని ఎందుకంటే అన్ని పోటీ పరీక్షల్లా కాకుండా ఈ పరీక్షలో నార్మలైజేషన్ లాంటి ప్రక్రియలు ఉండటం వలన ఎదురుచూస్తున్నామని అభ్యర్థులు తెలియజేస్తున్నారు…..వీలయినంత త్వరగా నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయాల్సిందిగా కోరుకుంటున్నామని పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు……

Join WhatsApp

Join Now

Leave a Comment