జనగాం జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి.. ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపు వెళ్లే రోడ్డు ప్రక్కనే ఊరికి దగ్గరలో తోడేలకుంట కుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవర పెడుతున్నాయి. రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరుగ వచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళుతున్న కూలీలు గమనించి స్థానికులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్ల మేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నరు. గ్రామ పెద్దలు స్థానిక పాలకుర్తి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు..
ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం..
Published On: December 31, 2024 6:42 pm
