ఎండలకు ఉక్కిరిబిక్కిరి.. సెక్రటేరియట్ వద్ద అధికారుల ‘కూల్’ ఐడియా.

ఎండలకు ఉక్కిరిబిక్కిరి.. సెక్రటేరియట్ వద్ద అధికారుల ‘కూల్’ ఐడియా.

రాష్ట్రంలో క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. మార్చి నెలారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడే 34 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో నగరవాసులు ఎండవేడికి అల్లాడిపోతున్నారు. అత్యవసర పనుల మీద బయటకు వస్తున్న నగర వాసులు మండుటెండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇదిలా ఉంటే పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సచివాలయం (TG Secretariat) వద్ద అధికారులు ‘కూల్’ ఐడియా చేశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులు, అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నంబర్ 2 వద్ద టెంట్లు (Tent) ఏర్పాటు చేశారు. టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఈ నిర్ణయం ఇటు భద్రతా సిబ్బందితో పాటు సచివాలయానికి వచ్చి వెళ్లేవారికి ఉపశమనంగా మారింది. మరోవైపు రోజు రోజుకు వేసవితాపం పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment