లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు

తెలంగాణలో వేర్వేరు ఘటనలలో లంచం తీసుకుంటూ పోలీస్, అటవీ శాఖల అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడుగా ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్య వెంకటరావుకు సాధారణ బెయిల్ నిమిత్తం అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ముక్తల్ పోలీస్ స్టేషన్‌ అధికారి రూ.40 వేలు డిమాండ్ చేశాడు.దీనిపై బాధితుడు వెంకటరావు ఏబీసీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మంగళవారం వెంకటరావు లంచం అడ్వాన్స్‌గా రూ.20వేలు సీఐ కార్యాలయంలో కానిస్టేబుల్ కుర్వ నర్సిములుకు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీఐ జి.చంద్రశేఖర్ ఆదేశాల మేరకు బాధితుడి నుంచి డబ్బులు తీసుకున్నట్లు కానిస్టేబుల్ నర్సిములు, శివలు వాంగ్మూలం ఇవ్వడంతో సీఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ, ఇన్స్ పెక్టర్ లింగస్వామిలు మీడియాకు తెలిపారు. నిందితులను హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వారు చెప్పారు.అలాగే భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం అటవీ శాఖ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రహదారి పనుల కోసం రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్ఓ ఉదయ్ కుమార్, బీట్ ఆఫీసర్ హరిలాల్‌ను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిందితులు ఇద్దరినీ వరంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment