యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం:- సమర శంఖమ్
SC రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును..తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్.. చేస్తూ”సామాజిక ఉద్యమ నేత MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జనవరి 27న హైదరాబాదులో జరిగే వేయి గొంతుకలు..లక్ష డప్పులు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శన విజయవంతం చేయడానికి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మాదిగ కవులు కళాకారుల యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.మాదిగ కళామండలి ఉమ్మడి జిల్లా ఇంచార్జి ఎర్ర సూర్యం నేనే, జిల్లా కన్వీనర్ మీసాల గణేష్ మాదిగ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదిగ కళాకారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పేరాల యాదగిరి హాజరు కావడం జరిగింది. జనవరి 27 ఛలో హైదరాబాద్ లక్ష డప్పులు – వేయిగొంతులు జయప్రదం కోసం పల్లె పల్లేనా కవులు కళాకారులు ప్రజలను సమయాత్తం చేయాలనీ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండలాల నుండి వివిధ ప్రజా కళాకారులు డప్పు కళాకారులు,ఎంఎస్పి, ఎమ్మార్పియస్, యం ఈ ఎఫ్, యం యస్ ఎఫ్ సంఘాల నుండి దళిత ఐక్యవేదిక చైర్మన్ భట్టు రాంచంద్రయ్య మాదిగ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాదిగ,ఎం ఎస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,ఎమ్మార్పియస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ,ఎం ఎస్ పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ,ఎమ్మార్పియస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ,ఎం ఎస్ పీ జిల్లా అధికార ప్రతినిధి సందేల శ్రీనివాస్ మాదిగ,పీపుల్ప్ మానిటరింగ్ రాష్ట్ర కన్వీనర్ సర్పంగ శివలింగం మాదిగ,కవి రచయిత భైరపాక స్వామి మాదిగ,యం ఈఫ్ జిల్లా ఇంచార్జీ ఇంజ మహేష్ మాదిగ,యం యస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ కొల్లూరు హరీష్ మాదిగ,బలహీన వర్గాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం కురుమ,కవులు – కళాకారులు పిట్టల శ్రీనివాస్,సగ్గు మణికంఠ, నకిరేకంటి రవి, గుండెల లింగ స్వామి, కరుణాకర్, ఆకాశ్,మాజీ సర్పంచ్ భిక్షపతి మాదిగ,బాల్ నర్సింహ్మ తదితర రాష్ట్ర జిల్లా నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.