కాకినాడ పరిధిలోని ఏలేశ్వరంలో సంక్రాంతి నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా షాప్‌లోకి స్పోర్ట్స్ బైక్ దూసుకుపోయింది. బైక్ అదుపు తప్పి యర్ర అబ్బాయి (26) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి పండు (20) పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు
Published On: January 14, 2025 12:40 pm
