చౌటుప్పల పట్టణ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు మరియు సంస్థాగత ఎన్నికల అధికారులతో కలిపి సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలోని 307 పోలింగ్ బూతులలో బూత్ కమిటీల ఎన్నిక నిర్వహించాలని, బిజెపి కార్యకర్తలు క్రమశిక్షణ కలవారని, ఉత్సాహవంతులను, యువకులను బూత్ కమిటీ అధ్యక్షులుగా నియమించాలని అన్నారు.
రాబోయే కాలంలో తెలంగాణలో బిజెపి జెండా ఎగురుతుందని, తెలంగాణ ప్రజలు రేవంత్ ప్రభుత్వం పై అసంతృప్తిగా ఉన్నారని,6 అబద్ధాలు 66 మోసాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సంస్థగత ఎన్నికల అధికారి కట్ట సుధాకర్ రెడ్డి, నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, జక్కలి రాజు, జాయింట్ కన్వీనర్ కాసాల జనార్దన్ రెడ్డి, రమణగోని శంకర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, ఆలె చిరంజీవి, దర్శనం వేణు, బొడిగె అశోక్, కోమటి వీరేశం, పిట్టల శ్రీనివాస్, సోమ నరసింహ, బచ్చనబోయిన దేవేందర్ , కైరం కొండ అశోక్ , కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్, పెంబర్ల జానయ్య, పందుల సత్యం, ముదిగొండ ఆంజనేయులు, దాచేపల్లి నరసింహ గుప్తా, పి రాజేందర్ నాయక్, రావుల ఎల్లప్ప, బిక్షపతి, పబ్బు వంశీ తదితరులు పాల్గొన్నారు.