అక్రమ అరెస్ట్ లను ఖండించండి….పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్..

 PDSU ఆధ్వర్యంలో జరుగు విద్యారంగ సమస్యల పరిష్కారంకై “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు….

ఈ సందర్బంగా PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమకారులను నిరంతర అక్రమ అరెస్ట్ ల ద్వారా ఉద్యమాలను, ఉద్యమకారులను అణచివేయాలనుకోవడం సరైన విధానం కాదు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ తరహా దోరనిని,పద్దతి మార్చుకోవాలనీ, ప్రజా ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు, వాక్ స్వాతంత్ర్యపు హక్కులకు స్వేచ్ఛయుత వాతావరణం కల్పించాలని, ప్రజల, విద్యార్థుల హక్కులకు భంగం కల్పించరాదనీ, విద్యార్థులను, ప్రజలను ముందస్తు అరెస్ట్ ల పేరుతో భయబ్రాంతులకు గురించేయడం, భయానక వాతావరణం సృష్టించడం పాలకుల నిరంకుశ విధానానికి నిదర్శనం అని అన్నారు. ఈ తరహా విధానం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. వెంటనే విద్యారంగ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment