అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, మార్చి 17, సమర శంఖం ప్రతినిధి:- అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఎలిగేడు మండలానికి చెందిన ఎం. అంజమ్మ. సుల్తాన్ పూర్ గ్రామ శివారులో తన తండ్రికి 10 గుంటల వ్యవసాయ భూమి ఉందని, తన తండ్రి మరణించినందున ఆ భూమిని ధరణి లో తన పేరు పై చేర్చి పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎలిగేడు తహసీల్దార్ కు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఏ.శంకరవ్వ తమ గ్రామంలో ప్రాజెక్టు కింద ముంపుకు గురైందని, ఆడపిల్లల కూలి వేతనం (ఆర్&ఆర్) ప్యాకేజ్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.