మంథని: జాతీయ రహదారి నిర్మాణం పై సమీక్ష నిర్వహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని: జాతీయ రహదారి నిర్మాణం పై సమీక్ష నిర్వహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

 

జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో చేపట్టాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మంథని, ఏప్రిల్ 24, సమర శంఖం ప్రతినిధి: వరంగల్ – మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణ పనులను సకాలంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.

గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి సి.ఎన్.జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు.

వరంగల్ మంచిర్యాల మధ్య 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పనులు సకాలంలో చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ పనులు పూర్తి చేశామని, పెండింగ్ చెలింపులు ఎక్కడైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం మంథనిలో నూతనంగా 50 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఉన్న పాత డీఈ ఇరిగేషన్ కార్యాలయము, ఇతర కార్యాలయాలు, అనువైన చోటికి తరలించే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణానికి భూమి త్వరగా అందించాలని అధికారులకు తెలిపారు. పాత డీఈ ఇరిగేషన్ కార్యాలయాన్ని మరో చోటుకి తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment