భూ భారతి చట్టంపై సందేహాల నివృత్తికి కృషి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 

భూ భారతి చట్టంపై సందేహాల నివృత్తికి కృషి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

_పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం_

_ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి ఏర్పాటుకు చర్యలు_

_మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక_

మంథని, ఏప్రిల్ 23, సమర శంఖం ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం రైతు వేదిక వద్ద బుధవారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం పై రైతులకు ప్రజలకు ఉన్న సందేహాలను పూర్తిస్థాయిలో నీ వృత్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

బుధవారం మంథని మండలంలోని నాగారం రైతు వేదిక వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.

భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు.

అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు.

రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు.

పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు , 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని అన్నారు.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. కొనుగోలు, దానం తనకా బదిలీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారని, స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ న్యూట్రిషన్ ఫీజు చెల్లింపు అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని, దస్తావేజుతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి భూమి పట్టం సమర్పించాలని అన్నారు.

వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణిత గడువు లోగా పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందని అన్నారు.

భూ భారతి చట్టం పై అవగాహన కల్పించేలా కర పత్రాలను పంపిణీ చేశామని, ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు.

భూ భారతి పోర్టల్ లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం 2500 రూపాయల ఫీజు చెల్లించాలని, దరఖాస్తు తో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని, ఈ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని లేకుంటే గడువు తర్వాత ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందని అన్నారు. భూమి హక్కు కలిగిన రైతులందరికీ 300 రూపాయల ఫీజు తో పాస్ బుక్ జారీ చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి
సురేష్ , మంథని తహసిల్దార్ కుమార స్వామి, రైతులు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment