బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే కి, కాకిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కి చౌటుప్పల,గజ్వేల్, బోనగిరి త్రిబుల్ ఆర్ భూనిర్వాసిత రైతులు హైదరాబాదులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ రైతుల సమస్యల పైన చర్చ జరిపించి త్రిపుర అలైన్మెంట్ శాస్త్రీయబద్ధంగా ఓఆర్అర్ నుండి 40 కిలోమీటర్లు తీసుకెళ్లాలని,భూమికి భూమి ఇవ్వాలని లేదా బహిరంగ రేట్ ప్రకారము పరిహారం తోపాటు ఉపాధి కల్పించాలని కోరారు. రోడ్డు వేయడం వలన జరిగే అభివృద్ధిలో ఫిబ్రవరి బాధిత రైతులను భాగస్వాములను చేయాలని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి ప్రభుత్వం మెడలు వంచి త్రిబుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. తర్వాత వారిద్దరూ సానుకూలంగా స్పందిస్తూ బాధితుల సమస్యలను అసెంబ్లీ మాట్లాడి రైతులకు న్యాయం జరిగేటట్టు చేస్తానమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసిక రైతులు ఏసిరెడ్డి దామోదర్ రెడ్డి, దబ్బేటి రాములు గౌడ్, బొమ్మిరెడ్డి ఉపేందర్ రెడ్డి, జాల వెంకటేష్ యాదవ్, జాల నరసింహ యాదవ్,జాల జంగయ్య యాదవ్, జాల శ్రీశైలం యాదవ్, జాల చిన్నవెంకటేష్ యాదవ్, రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అదిలాబాద్ కామారెడ్డి ఎమ్మెల్యేలకి వినతి పత్రం
Published On: December 10, 2024 8:21 am