ఎస్సి వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ కి బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో అమలు చేయాలని కోరారు. ఎస్సీ లోని 59 ఉపకులాలకు రాజ్యాంగ ఫలాలు ప్రాథమిక హక్కులు జనాభా నిష్పత్తి ప్రకారంగా అందాలని తెలిపారు. అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలని అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ వెంటనే తెలంగాణలో వేగవంతం చేయాలని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి యాదాద్రి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎం ఈ ఎఫ్. మాదిగ మహిళా సమాఖ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలిసి మాట్లాడి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, ఎం ఎస్ పి జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి సందేల శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగ స్వామి మాదిగ,బి శ్రావణ్ మాదిగ,కె జహంగీర్ మాదిగ, కె కుమార్ మాదిగలతో పాటు పలువురు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట . నల్లగొండ జిల్లాల నుండి తరలివచ్చిన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది.
ఎస్సి వర్గీకరణ తక్షణమే చేపట్టాలని జ్యుడిషియల్ ఏకసభ్య కమీషన్ కు వినతి పత్రం అందజేత
Published On: December 11, 2024 6:28 pm
