ఏపీలో వేసవిలో కోతలు లేకుండా ప్లానింగ్
ఏపీలో వేసవిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లకు (MU) చేరే అవకాశం ఉందని ఇంధనశాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి మొదటి వారానికే విద్యుత్ డిమాండ్ 227.02 MUలకు చేరింది. దీనికి అనుగుణంగా కోతలు లేకుండా విద్యుత్ సమకూర్చుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు నెలవారీ ప్రణాళికలను సిద్ధం చేశారు.