ఇష్టంతో ఆడండి కొంచెం కష్టపడండి విజయం మీదే : ఎమ్మెల్సి నవీన్ రెడ్డి

ముగిసిన తొమ్మిది రేకుల క్రికెట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్-2

క్రీడాకారులకి బహుమతులు అందించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి

విన్నర్ టీం : ఏమిగోస్ రన్నర్ టీం : లగన్

ఇష్టంతో ఆడండి కొంచెం కష్టపడండి క్రీడల్లో విజయం మీదే అని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో తొమ్మిది రేకుల క్రికెట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ -2 ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిది గా హాజరై ఫైనల్ మ్యాచ్ తిలకించి, క్రీడాకారులకి ఎమ్మెల్సి నవీన్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరిక శ్రమపెరిగి ఆరోగ్యంగా ఉంటారని, క్రికెట్ ఒక అత్యుత్తమమైన క్రీడ అని, క్రికెట్లో పాల్గొన్న క్రీడాకారులందరూ తమ అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచారు అని క్రికెట్ ఆటలో ఇంకా బాగా కష్టపడి గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిలకు వరకు ఎదగాలని, యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని, సక్రమమైన మార్గంలో నడిచి సమాజ అభ్యున్నతిలో పాలు పంచుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో కేశంపేట మాజీ జడ్పిటిసి నర్సింగ్ రావు, తొమ్మిది రేకుల మాజీ సర్పంచ్ సావిత్రి బాల్ రాజు గౌడ్ , ఎంపిటిసి యాదయ్య, కాకునూరు ఎంపిటిసి కోటేశ్వర్, ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు, పోమాల్ పల్లి మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి, తొమ్మిది రేకుల ఉపసర్పంచ్ రాంరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు నాయకులు, నాగిళ్ల వెంకట్, తొమ్మిది రేకుల యూత్ ప్రెసిడెంట్ పురుషోత్తం గౌడ్, బిఆర్ఎస్ నాయకులు ప్రేమ్ గౌడ్, కిశోర్, మల్లేష్, బాలయ్య, రాములు, ఆంజనేయులు యాదగిరి, రాజు, నరేందర్ రెడ్డి, శివ కుమార్ మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment