ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 24 (సమర శంఖమ్) :-
హత్య కేసులో ఆరుగురు నిందుతులకు జీవిత ఖైదు శిక్ష, మరొకరికి ఐదు సంవత్సరాలు శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సేకరించి పకడ్బందిగా చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించి రివార్డ్ అందజేశారు.2019 సెప్టెంబర్ 10న రాజకీయ వివాదాల కారణంగా పెనుబల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మాళకుంటలో జరిగిన హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా, ఒకరికి ఐదేళ్ల జైలుశిక్ష రూ.5వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి కోర్టులో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి శ్రీ గౌరవ ఎం. శ్రీనివాస్ గారు ఇటీవల తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ముత్తులింగయ్య, ఎస్సై వేంకటేశ్ , సిఐలు టి.రవికుమార్ , కరుణాకర్, ఎస్సై నాగరాజు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్ బాషా, కోర్టు డ్యూటీ ఆఫీసర్ (కానిస్టేబుల్ ) గిరి, హోంగార్డు సురేష్ బాబు అభినందించారు.