సిద్దిపేట పట్టణంలో (RAF) రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది తో ఫ్లాగ్ మార్చ్ ను జెండా ఊపి ప్రారంభించిన పోలీస్ కమిషనర్…
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడం ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశం.
ప్రజల ధన,మాన, ప్రాణ, రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నాం
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్..
భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్.ఏ.ఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) 1992 సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మరియు మతఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం. మన తెలంగాణ రాష్ట్రంలో హాకింపెట్ సికింద్రాబాదు నందు 99 బెటాలియన్ కలదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఈరోజు జిల్లాకు రావడం జరిగింది పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారు సిద్దిపేట పట్టణం ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జెండా ఊపి ఫ్లాగ్ మార్చ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఏరియా అవగాహన గురించి మరియు భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు తెలిపినారు. జిల్లాలో ఏదైనా శాంతిభద్రతల, సమస్య మతఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నిర్వహించడం ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపినారు. తేదీ: 20-12-2024 హుస్నాబాద్ పట్టణంలో, 21-12-2024 నాడు గజ్వేల్ పట్టణంలో, తేదీ: 22-12-2024 కొమురవెల్లి మండల కేంద్రంలో మరియు టెంపుల్ ఆవరణలో, తేదీ: 23-12-2024 నాడు దుబ్బాక పట్టణంలో, తేదీ: 24-12-2024 నాడు సిద్దిపేట పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం కలదు మరియు గౌరవెల్లి ప్రాజెక్ట్, కోమటి చెరువు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులు మరియు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు.
ఈరోజు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ కళ్ళు బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మెదక్ రోడ్ ఇక్బాల్ మీనార్, మోహింపుర, బారా ఇమామ్ ఎక్స్ రోడ్, సుభాష్ రోడ్, రేణుక నగర్, దోబిగల్లి, నెహ్రూ పార్క్, నర్సాపూర్ ఎక్స్ రోడ్, అంబేద్కర్ నగర్, సంజీవయ్య నగర్, కరీంనగర్ రోడ్డు వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టి.పి. బగేల్, సిద్దిపేట ఏసీపీ మధు, ఆర్ఏఎఫ్ ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వరరావు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మరియు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మంది పోలీస్ సిబ్బంది 150 పోలీస్ అధికారులు సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు.మిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.