ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 17 (సమర శంఖమ్ ) :-
నేలకొండపల్లి,ముదిగొండ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ గారు స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు, జనరల్ డైరీ రికార్డులను పరిసరాలను పరిశీలించారు. పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, DC షీట్, సస్పెక్ట్ షీట్‌లు, NBW అమలు, CCC పిటిషన్‌లు పెండింగ్ ఆంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇటీవల వృద్ధ దంపతులను పధకం ప్రకారం హత్య చేసిన నిందుతులను పట్టుకునేందుకు కేసును చాలెంజ్ గా తీసుకొని చెధించిన పోలీస్ సిబ్బందికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పకడ్బంది ప్రణాళికతో అందుబాటులో వున్న సాంకేతికన వినియోగించి కీలకమైన హత్య కేసును అనతికాలంలోనే చేధించారని అన్నారు. అదేవిధంగా సరిహద్దు ల నుండి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు, రెగ్యులర్ రోల్ కాల్ విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి , సిఐలు సంజీవ్, మురళి , రాజు ఎస్సైలు పాల్గొన్నారు.