పెనుగంచిప్రోలు: వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై పోలీస్ డీసీపీ కి వినతి పత్రం

పెనుగంచిప్రోలు: వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై పోలీస్ డీసీపీ కి వినతి పత్రం

విజయవాడ, మార్చి 19, సమర శంఖం ప్రతినిధి:- ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఈ నెల 18వ తేదీన బుధవారం తెల్లవారు జామున (ఉదయం) శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల సందర్బంగా అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పసుపు – కుంకుమలు సమర్పించుటకు అన్ని పార్టీల వారు ప్రభలు కట్టుకొని వస్తుండగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ కూడలి సమీపంలో టీడిపి × వైసీపీ వర్గీయలు మధ్యలో ఘర్షణలు జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ 30 మంది కార్యకర్తల పైనే కేసులు కట్టడం బాధాకరం అని వైసీపీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సంఘటనపై క్షుణ్ణంగా పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై కేసులు కట్టవలసిందిగా కోరుకుంటూ డిసీపీ మహేష్ రాజ్ కు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వినతి పత్రం అందజేశారు.

లేనిపక్షంలో మీరు ఏ విధంగా అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తారో అదే విధంగా ప్రజల మద్దతుతో అందర్నీ కలుపుకొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్కపుడి గాంధీ, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ నంబూరి రవి, న్యాయవాది శివరాత్రి పృద్వి, కన్నమాల శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment