ప్రధానమంత్రి స్కూల్ పర్ రైసింగ్ ఇండియా స్కీంకు 30 పాఠశాలలు ఎంపిక : జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
వికారాబాద్ జిల్లా లో ప్రదాన మంత్రి స్కూల్స్ పర్ రైసింగ్ ఇండియా (పి ఎం ఎస్ ఎచ్ ఆర్ ఐ ) స్కీం క్రింద 30 పాఠశాలలను ఎంపిక చేయడము జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.గురువారము వీడియో కాన్ఫరెన్సు హాలు నందు జిల్లా లోని 30 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా స్కీం కింద రెండు విడతలలో కలిపి 30 పాఠశాలలు ఎంపిక కావడం జరిగిందని, ఇందులో (06) ఆదర్శ పాఠశాలలో (02) కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, (02) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, (02) గురుకుల పాఠశాలలు అదేవిదంగా (18) ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఎంపిక కాబడిన ప్రతి పాఠశాలలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. ప్రతి పాఠశాల యొక్క కనీస అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల యొక్క కనీస అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పీఎం శ్రీ స్కీం కింద వచ్చిన నిధులను సరిగ్గా వినియోగించుకోవాలని, ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకొని తదుపరి జరగబోయే సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా లో వసతి గృహాలలో చేపట్టిన పనులపై మరియు పాఠశాలకు మంజూరు అయిన నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరించారు.
ఈ సమావేశములో జిల్లా విద్యా శాఖాదికారి రేణుక దేవి, ప్రదానోపద్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.