రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ప్రజా సంఘాలు..

 అహంకారపూరితమైన, తిరస్కార స్వరంతో అమిత్ షా భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన రాజ్యసభలో అవమానకరమైన, అహంకారపూరిత వాక్యాలు చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, కల్లుగీత కార్మిక సంఘాల జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను అగౌరవపరిచి , అపహాస్యం చేయడానికి ప్రయత్నించిన హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జిల్లా కార్యదర్శులు కొండమడుగు నర్సింహ్మ , అన్నంపట్ల కృష్ణ , గడ్డం వెంకటేష్, బొలగాని జయరాములు మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు కేవలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసినవి మాత్రమే కాదని సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వర్గాలకు జరిగిన అవమానమని అన్నారు. భారత రాజ్యాంగంపై బిజెపి చేస్తున్న దాడికి వ్యతిరేకంగా భారత ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూత్వ శక్తులచే నిరంతరం దాడికి గురవుతున్న భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన నిశ్చయాత్మక చర్యల నిబంధనల పరిరక్షణ కోసం పోరాడటానికి లక్షలాది మందిని ప్రేరేపించాయని తెలియజేశారు. భారత ప్రజలపై మనువాద భావజాలాన్ని రుద్దేందుకు మతోన్మాద బిజెపి, ఆర్ఎస్ఎస్ శక్తులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయ ఆవేదన వెలిబుచ్చారు. షా మరియు బిజెపి పార్టీ వారి ఆలోచనలో కులతత్వం, మతతత్వం ఉండడం వల్ల రాజ్యాంగం పట్ల నిజమైన గౌరవం లేదనే విషయం మరోసారి రుజువు అయిందని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి తరచుగా వ్యక్తం చేసే అసహనం భారతదేశంలో సామాజిక న్యాయం , సమానత్వం కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పోరాడి నడిపిన ఉద్యమాలు మరియు ఆదర్శాల పట్ల వారిలో లోతైన ద్వేషాన్ని వెల్లడిస్తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ఈ మతోన్మాదులను మనువాదులను ఈ దేశము నుండి గద్దె దింపే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్ , డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి. సలీం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు న్యాయవాది బొడ్డు కిషన్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కమిటి సభ్యులు వడ్డేపల్లి యాదగిరి, నాయకులు పాలడుగు రవి, నల్లగారి నర్సింహ,మావురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment