తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన మహాలక్ష్మి పథకం ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలలో ముఖ్యమైన పథకం మహాలక్ష్మి పథకం అని అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు రోజుకు 45.49 లక్షల నుంచి 58.13 లక్షల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, 27.80 శాతం మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని మహిళలంతా ఈ ఉచిత ప్రయాణాన్ని అద్భుతంగా వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా మేడారం జాతర సందర్భంగా ఈ సంవత్సరంలో వేల మందికి సమ్మక్క సారలమ్మ వారి ప్రసాదం పార్సెల్ రూపంలో అందజేయడం జరిగిందని, హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ఏసి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, సుల్తానా సలీం, లడ్డు మొయినుద్దీన్, డిపో మేనేజర్ ఇందిరా, డిప్యూటీ ఆర్.ఎం.శంకర్, సమీర్, లింగం, మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవాలు
by Sravan Kumar
Published On: December 6, 2024 11:59 am
---Advertisement---