నీళ్లు పెట్టండి మహాప్రభో

నీళ్లు పెట్టండి మహాప్రభో

యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ఇండ్లల్లోకి నీళ్లు రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ట్యాంకర్లతో నీళ్లు పోయించుకుంటున్నారు. గ్రామ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని  ఆరోపిస్తున్నారు. గ్రామ కార్యదర్శి కి, కాలనీ వాసులు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు. వాళ్లకు నచ్చిన గల్లీలకి, ఇష్టం ఉన్న గల్లీలకి మాత్రమే నీళ్లు పెడుతున్నారని మోరపెట్టుకుంటున్నారు. పదిహేను రోజులకు ఒక్కసారైనా పెట్టండి సారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment