సినిమా డైలాగులు వద్దు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తాం: సీఎం రేవంత్ రెడ్డి

సినిమా డైలాగులు వద్దు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తాం: సీఎం రేవంత్ రెడ్డి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, తెలంగాణను అప్పుల గడ్డకెక్కించినట్లు ధ్వజమెత్తారు. 2023లో మా వద్దకి రూ.7 లక్షల కోట్లు అప్పు చేయడంతో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.18వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసింది.

ఈ రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు.

సినిమా డైలాగులు వద్దు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుదామని అనుకుంటే,ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండి సోది మాట్లాడటం కాదు, నిజంగా నీకు గట్టిగా కొట్టే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి రైతులకు ఎన్ని రుణమాఫీలు చేశామో అసెంబ్లీ ముందు వివరంగా చెప్పాలని అన్నారు.

కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. దళితుల కోసం 3 ఎకరాల భూమి, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి హామీలను ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్ కు ఉంటే, అది ప్రజల్ని మోసం చేయడమే అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్, ప్రజల నుంచి తప్పించి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి హామీ ఇచ్చి, స్వంత ప్రాజెక్టులలో రుణాలు చెయ్యడమే అన్యాయంగా ఉందన్నారు.

అంతేకాకుండా..’అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్‌ది. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమేనని,అన్నారు

ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే. కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21వేల కోట్లు రుణమాఫీ చేశాం. మేం రుణమాఫీ చేయలేదంటు న్న కేసీఆర్‌ ఫాం హౌస్ కు వచ్చినోళ్లకు చోద్యం చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం..

రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం.. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా.. నీలా ఇచ్చిన హామీ లను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు..

Join WhatsApp

Join Now

Leave a Comment