ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజు ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ధర్మసమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది . ధర్మ సమాజ్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే యాతాకుల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదలైనటువంటి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం ఉపాధి ,1 ఎకరం భూమి, 4 గదులఇల్లు కల్పించాలని కోరుతూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బందల అశోక్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్ సార్ , మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె చాంద్ , ఆర్.టి.ఐ రక్షక్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సతీష్, పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ , మండల ఉపాధ్యక్షులు మేడి మల్లేష్ , కార్యదర్శి నకిరేకంటి స్వామి , నకిరేకంటి నరేందర్ ,దిలీప్ పాల్గొన్నారు.