చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం.

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం  చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలు,, ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నాట్లు సమాచారం. ఘటనలో బస్సు స్వల్ప ప్రమాదం నుండి బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment