చౌటుప్పల్ పోలీస్ సిబ్బంది తో రూట్ మార్చ్ ప్రోగ్రాం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు చౌటుప్పల్ పోలీస్ సిబ్బంది తో రూట్ మార్చ్ ప్రోగ్రాం ర్యాలీ పోలీసులు నిర్వహించారు. అనంతరం స్థానిక సిఐ మాట్లాడుతూ.. ఈరోజు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు సివిల్ పోలీసులతో ఏరియా డామినేషన్ గురించి పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి వలిగొండ క్రాస్ రోడ్ మరియు తంగడపల్లి క్రాస్ రోడ్ నుండి బస్టాండ్ మీదుగా చిన్న కొండూరు రోడ్డు నుండి శివాజీ నగర్ బీసీ కాలనీ లో లాంగ్ మార్చ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అని,ముందు ముందు జరగబోయే బందోబస్తు మరియు రాబోయే కాలంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలలో అవగాహన కల్పించడానికి కొరకు ఈ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారితో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది.రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30 మంది, సివిల్ పోలీసులు 20 మంది మొత్తం 50 మందితో పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ లాంగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపిడి యాక్షన్ ఫోర్స్ ఇంచార్జ్ వినోద్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment