ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్పోరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 28న ఢిల్లీలో ఆలిండియా సదస్సు ను జయప్రదం చేయండి 

ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్పోరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 28న ఢిల్లీలో ఆలిండియా సదస్సు ను జయప్రదం చేయండి

సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గడ్డం సదానందం

అర్ఎస్ఎస్-బీజేపీ ఫాసిస్టు, కార్పోరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం కోసం పోరాడాలని కోరుతూ సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ఆలిండియా కమిటీ ఫిబ్రవరి 28, 2025న ఢిల్లీలో ఆలిండియా సదస్సును నిర్వహిస్తున్నది.ఈ సదస్సును జయ ప్రదం చేయాలని కోరుతూ దేశ వ్యాపితం గానూ, రాష్ట్రంలోనూ పార్టీ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ఢిల్లీలో జరిగే సదస్సును విజయవంతం చేయాలని మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం సదానందం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రధాని నరేంద్ర మోడి సబ్కా సాత్, సబ్కా వికాస్ అని ప్రగల్భాలు పలికి 10 సంవత్సరాల తర్వాత అది “కార్పోరేట్ కా సాత్, కార్పోరేట్ కా వికాస్”గా మారిపోయింది. ఈ 10 సంవత్సరాలలో జనవరి 31న విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం “కంపెనీల లాభాలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.అయితే నిజ వేతనాల్లో పెంపులేదు అని పేర్కొన్నది. కాని కార్పోరేట్ లాభాలు 22 శాతం పెరిగాయి. ఉపాధి 1.5 శాతం మాత్రమే. 4000 కంపెనీల ఆదాయం 6 శాతం పెరిగింది. అంటే మోదీ అభివృద్ధి కేవలం సంపన్నులకే అని స్పష్టమవుతున్నదని అన్నారు.

ధనికుల-పేద ప్రజల మధ్య అసమానతలు మరింత పెరిగి పోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు క్షీణించాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. కనీస మద్దతు ధర లేదు. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. నిన్న ప్రకటించిన బడ్జెట్లో ప్రజానుకూలంగా లేదు. విద్య, వైద్యానికి జీడీపీలో 6 శాతం, 3 శాతం కేటాయించాలన్న డిమాండ్ కు స్పందన లేదు. పైగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నది. కుల, మతాలను ప్రేరేపించే వైపుగా సాగుతున్నది. ఆర్ఎస్ఎస్ పరివార్ శక్తులు మరియు మోడీ-3 ప్రభుత్వం లౌకికవాదంపై దాడులుచేస్తూ లౌకిక వాదాన్ని దెబ్బతీస్తున్నది. వలస ప్రజలకు బేడీలు – ఉచితాలపై అనుచిత ప్రసంగాలు:- దేశ భక్తిని నిండా పులుముకున్న చందంగా మాట్లాడే మోడీ, బీజేపీలు అమెరికా నుండి అక్రమ వలస ప్రజలను బేడీలు వేసి, యుద్ధ విమానాల్లో తరలించినా, నోటి నుండి ఒక్క మాట రాలేదు. పైగా “నాక్లోజ్ (ఫ్రెండ్” అని మాట్లాడటం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలని మాట్లాడుతున్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న డిల్లీలో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని అన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment