మల్కాపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ డ్రైవర్ మృతి

 

 

హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పలలోని దండుమల్కాపురం ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మృతుడు నల్గొండ డిపోకు చెందిన సలీం (45)గా గుర్తించారు. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment