అంబేద్కర్ ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత సంఘాల చైర్మన్ సంఘ పాక చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నో అవమానాలు, అసమానతలు, అంటరాని తనం ఎదుర్కొని, తన జీవితాన్ని త్యాగం చేసి ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగం రాసి భారత దేశంలో ని దళితుల కు, బడుగు బలహీన వర్గాల కు, మహిళలకు స్వేచ్ఛ, హక్కులు సాధించి పెట్టిన మహోన్నత మైన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. తెలంగాణ మలుదశ ఉద్యమంలో ఎల్బీనగర్ ప్రాంతంలో కీలక పాత్ర పోషించి అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుంటూ పదిమందికి ఆదర్శవంతంగా చంద్రశేఖర్ ఉంటున్నారు. ఆపద ఉందంటే అరక్షణంలో నేనున్నాను అనే భరోసా ఇచ్చే ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నత చదువుల కోసం కృషి చేస్తూ నిత్యం నా బహుజన జాతిని మేలుకొలపాలని తారస పడుతుంటారు. ఈ సమాజానికి మంచి ఉన్నంత స్థాయిలో ఉంచాలి అని ప్రతిక్షణం తాపత్రయపడుతూ అందరి మనసులో మంచి నాయకుడిగా ఉన్నటువంటి దళిత సంఘాల చైర్మన్ సంఘ పాక చంద్రశేఖర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మహనీయునికి పూలమాలతో నివాళులర్పించారు.
అంబేద్కర్ ఆశయ సాధన కు కృషి చేయాలి… సంఘ పాక చంద్రశేఖర్
Published On: December 6, 2024 6:09 pm
