14న అత్యధిక కళ్యాణాలు అర్జిత సేవలో రద్దు 15న కనుము మహోత్సవం.చిన్న వెంకన్న క్షేత్రంలో ఈనెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సంబరాలు జరుగుతాయని ఆలయ ఇన్చార్జి ఏవో వేండ్ర త్రినాధరావు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయ తూర్పుగోపురం వద్ద కోలాటం నృత్యాలు,బుడబుక్కల వేషధారణలు,భజనలు, హరిదాసుల వేషధారణలతో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 14న సంక్రాంతి సందర్భంగా నిత్యార్జిత కళ్యాణము, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామని భక్తులు గమనించగలరని కోరారు. ఈనెల 15న మధ్యాహ్నం నుంచి సోమవారం కనుమ పండుగ నిర్వహణ నిమిత్తం దొరసానిపాడు గ్రామానికి అట్టహాసంగా బయలుదేరి వెళ్తారని ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలి రావాలని ఈవో కోరారు.
ద్వారకా తిరుమలలో 13 నుంచి 15 వరకు సంక్రాంతి సంబరాలు
Updated On: January 6, 2025 11:31 am
