తెలుగు లోగిళ్ళలో పండుగ సందడి సంక్రాంతి.

 సంక్రాంతి సంబురాలకు పల్లెలు ముస్తాబయ్యాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో మూడు రోజుల పాటు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల తో పండుగ సంబురాలు నిర్వహించుకోవడానికి పట్నం వాసులు ఇప్పటికే పల్లెలకు చేరుకోవడంతో గ్రామసీమలు సందడిగా మారాయి. భోగి, సంక్రాంతి, కనుమను జరుపు కోనుండగా, ఇంటింటా పిండి వంటలు ఘునుఘుమలా డుతున్నాయి.ఇక నోములు, వ్రతాలు ఆచరించేవారు పూజా సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. పతంగులు ఎగురవేతలో చిన్నారులు బిజీగా మారారు. పతంగుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. అలాగే ప్రభుత్వం యాసంగి సాగుకు గాను రైతుబంధు సాయం జమ చేస్తుండడంతో రైతులు ఈ సంక్రాంతిని సంబురంగా నిర్వహించుకోవడానికి సిద్దమవుతున్నారు.

సంక్రాంతి.

పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. ఒక్కో పండుగ కు ఒక్కో ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ లో భోగికి ప్రత్యేకత ఉంది. పాత వస్తువులను మంటల్లో వేసి చెడును పారదోలి మంచిని ఆస్వాదించడం భోగి విశిష్టత. ఆడపడుచులు కొత్త బట్టలు వేసు కొని ఇంటి ఎదుట వాకిళ్ల లో రంగు రంగుల రంగ వల్లులు వేస్తారు. ఉదయాన్నే పాలు పొంగించి, ఇంటి ముంగిట గొబ్బెమ్మలు పెట్టి నవ ధాన్యాలు పోస్తారు. సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది, ద్వాదశ రాశులందు క్రమం గా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశి లోకి ప్రవేశించడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. హేమంత రుతువులో చల్లటి గాలులు, ముంచుకురిసే కాలం లో సూర్యుడు మకర రాశి లో కి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ సమయంలో మకర సంక్రాంతికి ప్రాధాన్యం సంతరించుకుంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. అందుకే స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురా ణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలు చాలా గొప్పవని చెబుతారు. ముఖ్యంగా ధాన్యం, ఫలాలు, కాయ గూరలు తదితర వాటిని దానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.

ఇంటింటా పిండి వంటలు.

పండుగకు వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు తయారు చేస్తారు. ఈ పండుగకు సకినాలు స్పెషల్. బియ్యం, పిండి,వాము,ఉప్పుతో కలిపి సకినాలు తయారు చేస్తారు. గారెలు, పూసబిల్లలు, అరిసెలు ఇలా పిండితో అనేక వంటకాల ను ఇంటి ంటా చేస్తారు. మాంసాహార ప్రియులు సజ్జలు, నువ్వులతో చేసిన రొట్టెలను ఎంతో గా దేశీ చికెన్తో కలిపి తింటారు. కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కలయికతో సరదాగా గడుపుతారు

డూ…డూ…బసవన్న

తెల్లవారక ముందే గంగి రెద్దుల వారు డూడూ బసవన్న అంటూ ఇంటి ముంగిట్లో ఉంటారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మ గారికి దండం పెట్టూ అంటూ వారి కులవృ త్తులను ప్రదర్శిస్తారు. డోలు తిప్పుతూ, సన్నాయి పాటలతో గంగిరెద్దుల నృత్యాల తో ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షం తీసు కుంటారు. ఇంటి యజమాని నిద్ర లేచే వరకు తన డోలు తో శబ్దం చేస్తూనే ఉంటారు. యజమాని నిద్ర లేచి దానం చేస్తే అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్తారు.

హరిదాసు కీర్తనలు.

హరిదాసుల కీర్తనలతో పల్లెలన్నీ మార్మోగుతాయి. హరిలో రంగ హరి… అంటూ హరిదాసులు గ్రామాల్లో దర్శనమిస్తారు. హరిదాసు వేషధారణ సైతం చూడ ముచ్చటగా ఉంటుంది. నడినెత్తిపై చెంబు, తిరుమని పట్టె లతో, కంచు, గజ్జెలు కట్టుకుని గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఇండ్ల వద్దకు వస్తారు. చిరుతలు కొడుతూ చేసే కీర్తనలు. భలేగా ఉంటాయి.

…ఇంటి ముంగిట గొబ్బెమ్మలు..

ఇంటి ముంగిట్లో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెడతారు.గొబ్బెమ్మలతో పాటు అందులో నవధాన్యాలు పోస్తా రు.గొబ్బెమ్మకు గరక పోష, గడ్డి పువ్వు, పసుపు, కుంకుమలు పెట్టి అందంగా తయారు చేస్తారు. పండుగ మూడు రోజులు ఇంటి వాకిళ్లలో, పశువు పాక వద్ద ప్రత్యేకంగా పెడతారు.

..పిల్లల గాలిపటలు

సంక్రాంతి వచ్చిందంటే పిల్లలకు మహా సరదా. దసరా తర్వాత పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పండుగ సంక్రాంతి. ఎక్కువ శాతం పిల్లలంతా తమ అమ్మమ్మ వాళ్ల ఇండ్ల లోకి వెళ్లి సరదాగా గడుపుతారు. పట్టణాల్లో ఉన్న వారంతా పల్లెలకు చేరుకుంటారు. నిత్యం పుస్తకాలు, ఆన్లైన్ క్లాసులతో కుస్తీ పట్టి అలసిసొలసిన పసి హృదయాలు గాలి పటాలను ఎగురవేసి ఆనందిస్తారు. రంగు రంగుల గాలి పటాలను పోటాపోటీగా ఎగురవేస్తూ కేరింతలు కొడతారు.

మార్కెట్లు కళకళ…

ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. జీడి, రేగు పండ్లు, గొబ్బెమ్మలు, వివిధ రకాల రంగులు, మట్టి పాత్రలు,గరిక,బంతిపూల కొనుగోళ్లతో సందడిగా మారాయి. వివిధ రకాల గాలిపటాలు, చక్రీలు, దారాలు భారీగా విక్రయిస్తున్నారు. మహిళల వ్రతాలు, నోముల సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. ఈసారి పండుగ సమయానికే రైతుబంధు డబ్బులు వస్తుండడంతో రైతుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. దీంతో పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment