సీనియర్​ నటుడు మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

 సీనియర్​ నటుడు మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులోనే ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ మోహన్​బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మోహన్​బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment