విద్యార్థినికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరులోని గురుకుల పాఠశాలలో గురువారం వేడి పాలు మీద పడి 5వ తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ విద్యార్థిని ని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.