రాజ్యాంగ నిర్మాతకు అవమానం
గోదావరి జిల్లా, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:- తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి తెలియని వ్యక్తులు చెప్పుల దండలు వేయడం ఉదృత తకు దారితీసింది.
ఆదివారం ఉదయం విగ్రహానికి చెప్పుల దండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, మాల మహానాడు సభ్యులు రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగారు.
స్థానికులు మండలంలోని అంబేడ్కర్‌వాదులు, మాల మహానాడు నేతలకు సమాచారం తెలపడంతో వారు భారీ ఎత్తున తరలి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ఆదనపు ఎస్పీ సుబ్బరాజు, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ సిబ్బందితో హూటహూటిన చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంఘటనా స్థలానికి వచ్చి అంబేడ్కర్‌ను అవమాన పరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. రాస్తారోకో చేస్తున్న వారితో కలిసి రోడ్డు పై కూర్చుని సంఘీభావం తెలిపారు.
ఈ విషయంపై మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని చెప్పుల దండతో అవమానపర్చారని, అక్కడ నూతన విగ్రహాం ఏర్పాటు చేసి పైన షెల్టర్ నిర్మించాల ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం డీఎస్పీకి వినతి పత్రం అందించారు.
గోపాలపురం జనసేన కన్వీనర్ దొడ్డిగర్ల సువర్ణరాజు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించి శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. డీఎస్పీ, సీసీఎస్ సీఐ అనుకూరి శ్రీనివాస్, దేవరపల్లి సీఐ బియస్ నాయక్, నల్లజర్ల సీఐ విజయశంఖర్ అంబేడ్కర్‌వాదులతో చర్చలు జరిపి అంబేడ్కర్ విగ్రహానికి పాలా భిషేకం చేసి పూలమాలలు వేశారు.