సుల్తాన్ బజార్ క్లాక్ టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేసిన వీరనారీ ఈమె
జ్ఞాన కుమారీ హెడా హైదరాబాద్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని అనేక సార్లు జైలుకు కూడా వెళ్లారు. జాతీయోద్యమంలో పాల్గొన్న అతి తక్కువ మంది మహిళల్లో ఈమె ఒకరు. జ్ఞాన కుమారీ 1918 అక్టోబర్ 11న ఉత్తర ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జా గ్రామంలో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు హరీష్ చంద్ర హెడాను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సుల్తాన్ బజార్ క్లాక్ టవర్‌పై మొదటి సారి జాతీయ జెండాను ఎగురవేసి మహిళలల్లో ధైర్యం నింపారు.