బోదులబండ గ్రామానికి చెందిన షేక్ అజీమ్ JEE MAT కు అర్హత సాధించారు
హైదరాబాద్ లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బార్కస్ బాయ్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు 2025 JEE మెయిన్స్ పరీక్షల్లో JEE MAT కు అర్హత సాధించినట్లు తెలంగాణా మైనారిటీ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల సెక్రటరీ మొహమ్మద్ ఫహిముద్దీన్ ఖురేషి ఒక ప్రకటన లొ తెలియచేసారు జేఈఈ మెయిన్స్‌లో బార్కస్ విద్యార్థులు అత్యధికంగా 98.4 శాతం మార్కులు సాధించారు తెలంగాణా రెసిడెన్షియల్ కళాశాల లొ మైనారిటీ విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం IIT మరియు JEE మెయిన్స్ కు ఉచిత ట్యూషన్ అందించి విద్యార్థుల ఉజవ్వలభవిషత్తు దోహదం చేస్తుందని,
రాబోయే రోజుల్లో మైనారిటీ విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హత సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు తెలంగాణా రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల సెక్రటరీ మొహమ్మద్ ఫహిముద్దీన్ ఖురేషి బార్కస్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిదంగా కళాశాల అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ఈ విషయం పట్ల షేక్ అజీమ్ తల్లీ తండ్రులు మరియు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు