11.5 గ్రాముల కోకైన్ పట్టివేత
రెండు స్క్రూటీలు, రెండు సెల్ ఫోన్లు ఇద్దరు వ్యక్తుల అరెస్టు
వృత్తి షార్ట్ ఫోటోగ్రాఫర్. చేసేది మాత్రం డ్రగ్స్ వ్యాపారం. షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్, డ్రగ్స్ అమ్మకాలతో రెండు చేతుల డబ్బులు సంపాదించాలని భావించి చివరకు డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ.. ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ పోలీసులకు పట్టుబడిన వుదంతా మీది .
జూబ్లిలీ హీల్స్, బంజారాహీల్స్‌లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గురువారం సాయంత్రం 11.5 గ్రాముల కోకైన్‌ను పట్టుకున్నారు.
జూబ్లిలీ హీల్స్ రోడ్డు నెంబ రు 7లో ఇద్దరు వ్యక్తులు గోవా నుంచి తీసుక వచ్చిన కోకైన్‌ను అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తు ఉండగా ఎస్ టి ఎఫ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సైలు బాలరాజు, సంధ్యా సిబ్బంది కలిసి ఇద్దరిని పట్టుకున్నారువారి వద్ద ఉన్న 11.5 గ్రాముల కోకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పాటు రెండు స్క్రూటీలను, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి 12 గ్రాముల కోకైన్ ను రూ. 6 వేలకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ. 14 వేలకు గ్రాము చొప్పున అమ్మకాలు జరుపతున్నట్లు నిందితుల విచారణలో తేలింది.
పట్టుబ డిన కోకైన్, స్క్రూటీలు, సెల్ ఫోన్లు కలిసి రూ. 2.11 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.