ఎంపీ రవిచంద్ర ప్రగడవరంలో ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రగడవరంలో ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ పుణ్య దంపతులు బుధవారం మధ్యాహ్నం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం చేరుకుని శ్రీశ్రీశ్రీ విజయశంకర బాల కనకదుర్గాదేవి శివ పంచాయతన క్షేత్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా క్షేత్రం మాత ఆధ్వర్యాన వేద పండితులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు క్షేత్రంలో కొలువైన విజయశంకర బాల కనకదుర్గాదేవి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు, అభిషేకం చేశారు, తలంబ్రాలు సమర్పించారు.పుణ్య దంపతులు రవిచంద్ర-విజయలక్మీలను మాత సత్కరించి,వేద పండితులతో కలిసి ఆశీర్వచనాలు పలికారు,తీర్థ ప్రసాదాలు అందజేశారు.మహా శివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు.