ఘనంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పదవ వార్షికోత్సవ వేడుకలు
మండల పరిధిలోని దేవరం పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పదవ వార్షికోత్సవ వేడుకలను ఆ గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఈనెల 15న వివిధ కార్యక్రమాలతో మొదలై బుధవారం ఆలయ పదవ వార్షికోత్సవంతో ముగిశాయి. ఈ వార్షికోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మండలంలోని వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని, దైవచింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని తెలిపారు. ఈ వార్షికోత్సవంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ నరహరి రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ల గోనే ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, దామరగిద్ద మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తా, కాంగ్రెస్ మండల మాజీ యూత్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, బీజేపీ మండలాధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి, యువ నాయకులు మల్గారి డా.వైభవ్ రెడ్డి, బీజేపీ నాయకులు శేఖర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, జయసింహా రెడ్డి, మల్లారెడ్డి, ప్రకాష్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు అబ్ధుల్ గనీ, గ్రామపెద్దలు ఆనందచారి, వేణుగోపాల్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.