పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం…రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. గురువారం హెచ్ఐసీసీ నోవోటెల్ లో నిర్వహించిన హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించినట్లు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి యువ నాయకత్వం చోదక శక్తిగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంటుందన్నారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పారిశ్రామికవేత్తలను కోరారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ ఎండీ విష్ణు వర్ధన్ రెడ్డి, హైబిజ్ టీవీ & తెలుగు నౌ ఎండీ ఎం.రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.