ఏపీ: 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు

ఏపీ: 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు

_రాష్ట్రంలో జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు

_ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల

పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ముస్లిం మైనార్టీల కు అత్యంత భక్తిశ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఎంజీ రోడ్డులో ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు నిర్ణయించారు.

రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు రానున్న 4, 5 రోజులలో జిల్లా స్థాయి ఇఫ్తార్ కార్యక్రమాన్ని వారికి అనువైన రోజున నిర్వహిస్తారు. ఇఫ్తార్ ను జిల్లాస్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా నిర్వహించాలని మైనార్టీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే. హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కు రూ.75 లక్షలు

విజయవాడ ఎంజీ రోడ్డు ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లోసెంటర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేయబోయే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి రూ. 75 లక్షలు మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో మిగతా రూ. 75 లక్షలు మొత్తాన్ని జిల్లాల వారీగా కేటాయించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాస్థాయిలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.

జిల్లాలలో ముస్లిం మైనారిటీల జనాభా ప్రాతిపదికన ఇఫ్తార్ కోసం నిధుల కేటాయింపు జరిగింది. శ్రీకాకుళంకు రూ. 1.50 లక్షలు, విజయనగరం కు రూ. 1.50 లక్షలు, మన్యం కు రూ. 1 లక్ష, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ. 1 లక్ష, విశాఖపట్నంకు రూ.3 లక్షలు, అనకాపల్లి కి రూ.2 లక్షలు, కాకినాడకు రూ.3 లక్షలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమకు రూ.3 లక్షలు, తూర్పుగోదావరి కి రూ.3 లక్షలు, పశ్చిమగోదావరి కి రూ.3 లక్షలు, ఏలూరుకురూ.3 లక్షలు, కృష్ణా కు రూ.3 లక్షలు, గుంటూరుకు రూ.4 లక్షలు, బాపట్ల కు రూ.3 లక్షలు, పల్నాడుకు రూ.3 లక్షలు,ప్రకాశం కురూ.3 లక్షలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకు రూ.5లక్షలు, కర్నూల్ కు రూ.4 లక్షలు, నంద్యాల కు రూ.5 లక్షలు, అనంతపురంకు రూ.3. 50 లక్షలు, శ్రీ సత్య సాయిజిల్లాకు రూ.3 లక్షలు, వైఎస్ఆర్ కడపకురూ.3.50 లక్షలు, అన్నమయ్య జిల్లాకు రూ.4లక్షలు, చిత్తూరు కు రూ.3 లక్షలు, శ్రీ బాలాజీ జిల్లా కు రూ.3 లక్షలు ప్రకారం జిల్లా స్థాయి ఇఫ్తార్ నిర్వహణకు నిధులు కేటాయిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment