వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం

భక్తుల కొంగుబంగారమైన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం శనివారం రాత్రి ఘనంగా సాగింది. గార్లదిన్నె మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసినస్వామి తిరునాళ్లలో భాగంగా మూడో శనివారం దేవాదయశాఖ , గ్రామస్థుల ఆద్వర్యంలో రథో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన ఆర్చకులు రామాచార్యులు స్వామివారి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి, హో మాలు చేశారు. అనంతరం స్వామి వెండి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిష్టించారు. ఆలయం వద్ద నుంచి కోటంక గ్రా మంలో ఊరేగించారు. మండలం నుంచే కాకుండా జిల్లాలోని నలుమూలా లు నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వామివారికి అడుగడుగున నిండుబిందెనీళ్లు పోసి, కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నామస్మరణాలతో కోటంక గ్రామం మారుమ్రోగింది. శింగనమల సర్కిల్‌ సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్‌భాషా ఆధ్వర్యంలో పోలీసు బందోబస్త్‌ నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment