జమ్మలమడుగులో ఉద్యోగం రాలేదని సూసైడ్
జమ్మలమడుగు రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. మృతుని వివరాలు పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కాకరవాడ కాపు వీధికి చెందిన దండే హరీశ్ రెడ్డిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.