గ్రామ పంచాయితీల్లో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ప్రారంభం

గ్రామ పంచాయితీల్లో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ప్రారంభం

మెరకముడిదాం, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- మెరకముడిదాం మండలంలో వేసవికాలంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 29 గ్రామ పంచాయతీలలో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి గొర్లె. భాస్కరరావు, ఆ శాఖ ఏఈ శివకుమార్ లు బుధవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమం మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 28 తేదీ వరకూ ఉంటుందన్నారు. పంచాయతీల వారీగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 5వ తేదీన బైరిపురం, 6న బుదరాయవలస, 7వ తేదీన చెల్లాపురం, చినరవ్యం, 10వ తేదీన విశ్వనాధపురం, పెదరవ్యం, కిలారిపేట, 11న చినబంటుపల్లి 12న పతివానిపేట, వాసుదేవపురం, సింగవరం, 13న గాదెలమర్రివలస, శివందరవలస, 15న సీతారాంపురం నల్లపురాజుపేట నారప్పదరవలస, బడ్నాయనవలస, 17న గొట్టిపల్లి, 18,19,20 తేదీలలో గర్భాం, 21న కొత్తవీధి, పెదమంత్రిపేట 22న చినమంత్రిపేట, బోడందరవలస, లెంకపేట, 24న నరసయ్య పేట, 25న గరుగుబిల్లి, 26న పెదపూతికవలస, చినపూతికవలస, 27న గొల్లలవలస, మిరాసిపేట, పైలపేట, 28న రాచపేట, 29న సిరిదేవిపురం, ఏప్రిల్ 2న యాడిక, 3న ఇప్పలవలస, 5న బిల్లల వలస, 7న కొండలావేరు, భగీరథపురం, బాణాం, 8న కొర్లాం, కొత్తకర్ర 9న సిరియాలపేట, కుంచుగుమడాం 10న మెరకముడిదాం, పాలేం 11న రామయ్య వలస, పాండ్రంకిపేట, 14న గొట్టిపల్లి గ్రామాలలో బోర్ వెల్స్ రిపేరు చేయుటకు మండల ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎంపీడీఓ గొర్లె భాస్కరరావు, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ శివ కుమారులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ బోర్ మెకానిక్ దేవుడు తో పాటు అవుట్సోర్సింగ్ ఎన్ఎమ్ఆర్ బోర్ మెకానిక్లు రాజు, సీతారాములు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment